పాన్ ఇండియా స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ తన స్వరంతో దేశావ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది అభిమానులను సంపాదించింది. తను పాట పాడిందంటే ఖచ్చితంగా ఆ పాట ఖచ్చితంగా చార్ట్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే.తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, ఒరియా లాంటి అనేక భాషల్లో పాటలు పాడిన రియల్ పాన్ ఇండియా సింగర్ ఆమె. ఒక్క తెలుగులోనే ఏకంగా 200కు పైగా పాటలు పాడారు. తన పాటలకు జాతీయ అవార్డులతో పాటు ఎన్నో అవార్డులు కూడా శ్రేయ అందుకున్నారు. ఇక శ్రేయా ఘోషల్ తన చిన్ననాటి స్నేహితుడు శిలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లి చేసుకుంది. 2021 వ సంవత్సరంలో ఈ దంపతులకు దేవయాన్ అనే కొడుకు కూడా జన్మించాడు.భారతీయ సినిమా నేపథ్య సంగీతానికి శ్రేయా ఘోషల్ రాణి అయితే, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ వ్యాపార ప్రపంచంలో బాగా రాణించారు.శిలాదిత్య ఏప్రిల్ 2022 వ సంవత్సరం నుండి కూడా ట్రూకాలర్ యొక్క గ్లోబల్ హెడ్‌గా ఉన్నారు. 


ట్రూకాలర్ వార్షిక నివేదిక ప్రకారం, జనవరి నుండి డిసెంబర్ 2023 వ సంవత్సరం దాకా దాదాపు రూ. 1406 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. శిలాదిత్య ముఖోపాధ్యాయ తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం వ్యాపార అభివృద్ధి, మొబైల్ అప్లికేషన్‌లు, సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ ఇంకా అలాగే ఆటోమేషన్ సిస్టమ్‌ల ఇంటిగ్రేషన్‌లో ఆయన స్పెషలిస్ట్. అంతకు ముందు ఆయన కాలిఫోర్నియాలోని SaaS కంపెనీ అయిన CleverTapలో సేల్స్ డైరెక్టర్‌గా పనిచేసి తరువాత సేల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశాడు. శ్రేయా ఘోషల్ ఇంకా శిలాదిత్య 10 సంవత్సరాలు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. స్నేహితుడి పెళ్లి సందర్భంగా శిలాదిత్య తనకు ప్రపోజ్ చేశాడని శ్రేయా ఘోషల్ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ మధ్య ఆమె తన భర్తను తన సోల్ ఫ్రెండ్ అని కూడా సంభోదించడం జరిగింది. 5 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న శ్రేయా ఘోషల్ ఇండియాలో అత్యధిక పారితోషికం పొందే సింగర్స్ లో ఒకరిగా నిలిచారు. కేవలం ఆమె ఒక్కరి ఆస్తి విలువ ఏకంగా 180-185 కోట్ల రూపాయల దాకా ఉండోచ్చని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: