కోలీవుడ్ స్టార్ హీరో అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు విజయ్. ఎన్నో హిట్ సినిమాలు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. కోలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉంది. అయితే గతేడాది లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన "లియో" సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా త్రిష నటించగా సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ తదితరులు పలు ఇంపార్టెన్స్ రోల్ లో నటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

ఇక ఈ మూవీ విడుదల అయిన తర్వాత ఓ ఈవెంట్ లో లోకేష్ కనగరాజ్ లియో సినిమా కి సీక్వెల్ గా మరో మూవీ వస్తుందని ప్రకటించారు. అయితే తాజాగా దర్శకుడు ఈ మూవీ సీక్వెల్ కి సంబంధించిన కథ రెడీ అయినట్టు తెలిపారు. అంతేకాకుండా విజయ్ ఈ సినిమాకు ఓకే చెప్తే షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ విజయ్ రాజకీయ పనులలో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సమయంలో ఆయన ఈ సినిమాకి ఓకే చెప్తాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ విషయం పై  విజయ్ అభిమానులు ఎంతో

 ఆసక్తిగా గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు  కొడుతుంది. ఇదిలా ఉంటే వెంకట్ ప్రభు దర్శకత్వంలో "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్" అనే సినిమాలో విజయ్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో ఆయన డబుల్ ఆక్షన్ లో అభిమానులను అలరించనున్నారు. కాగా ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన 69 వ సినిమాను కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేస్తున్నట్లు వార్తలు  కూడా  వినిపించాయి. అంతేకాకుండా ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వల్ల ఇదే ఆయన చివరి సినిమా అంటూ ఇండస్ట్రీలో వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక వీటన్నిటికీ విజయ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: