కేవలం ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అయితే ఈయన ప్రస్తుతం జై హనుమాన్ అని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం వచ్చిన హనుమాన్ సినిమాతో భారీ విజయని అందుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు జై హనుమాన్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హనుమాన్ సినిమాకి సీక్వల్ గా ఈ సినిమా రాబోతోంది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు హనుమాన్ తో భారీ విజయాన్ని అందుకోవడంతో జై హనుమాన్ తో కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంటాడు అని నమ్ముతున్నారు ఆయన అభిమానులు. ఇదిలా ఉంటే కేవలం తెలుగులోనే

 కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోలతో కూడా సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తోక సినిమా చేయబోతున్నాడు అంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఊహించిన విధంగా వీళ్ళిద్దరి కాంబోలో చేసిన మా ఆగిపోయింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ డైరెక్టర్ మరో సినిమాని ప్రారంభించాలి అని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. జై హనుమాన్ సినిమా చేస్తున్న సమయంలోనే మరొక సినిమా కూడా స్టార్ట్ చేసే పనిలో ప్రశాంత్ బిజీగా ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాను ఏ స్టార్

 హీరోతో చేయబోతున్నాడు అన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ ఒకేసారి రెండు సినిమాలు చేయడానికి రిస్క్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్. ఇప్పటికే జై హనుమాన్ షూటింగ్ 50% కంప్లీట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక మిగిలిన షూటింగ్ కూడా తొందర్లోనే కంప్లీట్ చేసి ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా కూడా హనుమాన్ సినిమా రేంజ్ లో సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మరో సినిమాని కూడా ఒక స్టార్ హీరో తో స్టార్ట్ చేసే ఉద్దేశ్యం లో తను ఉన్నట్టుగా తెలుస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: