టాలీవుడ్ లో మోస్ట్ అవాయిడేడ్ చిత్రంగా పేరు పొందింది కల్కి 2898AD చిత్రం ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేయబోతున్నారు. ప్రభాస్ అభిమానులు ఇందుకోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండగా జూన్ 27న భారీగా ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ముంబైలో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హిందీ ప్రేక్షకులకు ఉత్సాహాన్ని నింపింది. భారతదేశంలో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా కల్కి సినిమా ఉన్నది.అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ముంబైలో ఈవెంట్ జరిగినా కానీ అశ్వని దత్ బృందం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలాంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లను సైతం ప్లాన్ చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ మెగా ఈవెంట్ ను అమరావతిలో నిర్మించాలని వార్తలు వచ్చిన ఆ తర్వాత వేదికను హైదరాబాద్కు మార్చినట్లు సమాచారం.కానీ ఇప్పుడు ఒకేసారి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి ఈవెంట్ నిర్వహించకూడదని మేకర్స్ సైతం నిర్ణయించుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపైన ఇంకా అధికారికంగా ఏలాంటి ప్రకటన కూడా వెలుబడలేదు.


సలార్ సినిమా విడుదలకు ముందు కూడా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు సైతం చేయలేదు. మరి కల్కిని మాత్రం మొదటి నుంచి ప్రత్యేకమైన ప్రమోషన్స్ తో ముందుకు తీసుకు వెళుతున్నారు చిత్ర బృందం. ఐపీఎల్ ముందు వరకు ప్రత్యేకమైన ప్రోమోలను టెలికాస్ట్ చేశారు. ఆ తర్వాత బుజ్జి వాహనాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించడం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంటర్వ్యూలలో కూడా ప్రత్యేకమైన ఎపిసోడ్లను సైతం విడుదల చేస్తూ ఉన్నారు. ఇలా కల్కి సినిమాకి కావలసినంత ప్రమోషన్స్ కూడా దక్కుతూనే ఉన్నది. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈవెంట్ చేయడానికి మక్కువ చూపలేదని సమాచారం. ఈ విషయం మాత్రం ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ గా ఉన్నది. ఇందులో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే, దిశాపటాని నటిస్తూ ఉన్నారు. అమితాబచ్చన్ కమలహాసన్ రాజేంద్రప్రసాద్ శోభన తదితరులు నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: