వరుణ్ సందేశ్ గురించి ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. వీరిది ఆంధ్ర అయినప్పటికి అమెరికాలో స్థిరపడ్డారు. విద్యాభ్యాసమంతా అమెరికా లోనే జరిగింది. హ్యాపీడేస్ చిత్రం కోసం శేఖర్ కమ్ముల నిర్వహించిన నటనా పోటీలలో పాల్గొని ఆ చిత్రంలో చందు పాత్రను పోషించాడు. ఆచిత్ర విజయంతో వరుస అవకాశాలు చేజిక్కించుకొని నటునిగా స్థిరపడ్డాడు. ఆ తరువాత వచ్చిన సినిమాలు హ్యాపిడేస్ అంత హిట్ కాలేదు. అయిన ప్రయత్నం ఆపకుండ సినిమా చేశాడు.బిగ్ బాస్ ఇంట్లోకి 14వ కంటెస్టెంటుగా వరుణ్ సందేశ్ ఎంట్రీ ఇచ్చాడు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న వరుణ్... ఇలా అనూహ్యంగా బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు.వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం ది కానిస్టేబుల్.వరుణ్ సందేశ్ కి జోడిగా మధులిక వారణాసి హీరోయిన్ గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్  మాట్లాడుతూ.. "సినిమా షూటింగ్ అంతా చాలా హాయిగా సాగింది. త్వరలో కానిస్టేబుల్ పాత్రలో కొత్తకోణంలో, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను" అని చెప్పారు.నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. కథ, కథనాలు అద్భుతంగా అమరిన చిత్రమిదని. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ఆకట్టుకుంటారన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో వరుణ్ సందేశ్ నట విశ్వరూపం చూడవచ్చన్నారు. త్వరలోనే ఈ చిత్రంలోని పాటలను, మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తామని అన్నారు.ఇంకా దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా; హజరత్ షేక్ (వలి), సంగీతం :సుభాష్ ఆనంద్, ఎడిటింగ్: వర ప్రసాద్, B. G. M :గ్యాని, ఆర్ట్: వి. నాని, పండు, మాటలు :శ్రీనివాస్ తేజ, పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ, సహనిర్మాత: బి నికిత జగదీష్, నిర్మాత; బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం; :ఆర్యన్ సుభాన్ SK.

మరింత సమాచారం తెలుసుకోండి: