బ్లాక్ బస్టర్ సినిమా మగధీర చిత్రంలో సహా పలు దక్షిణ భారత చిత్రాల్లో భిన్నమైన పాత్రలు అండ్ మెప్పించే నటనతో దేవ్ గిల్ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన నైతృత్వంలో దేవ్ గిల్ ప్రొడక్షన్స్ నుంచి అహూ విక్రమార్క అనే మొదటి ప్రాజెక్ట్ రాబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశారు. పేట త్రికోటి దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

" ఇది అసుర రాజ్యం, ఇక్కడికి ఎవడైనా రావడమే తప్ప ప్రాణాలతో తిరిగిపోవడం ఉండదు " అనే డైలాగ్ తో ఈ మూవీ టీజర్ స్టార్ట్ అయింది. ఇక ఇందులో దేవ్ గిల్ పవర్ ఫుల్ పోలీస్ గా ఆకట్టుకున్నాడు. " పోలీస్ అంటే సింహం కాదురా.. సింహాన్ని కూడా వెంటాడే వేటగాడు " అనే డైలాగ్ తో సినిమా క్యాపబిలిటీ ఏంటో తెలిపారు మేకర్స్. టీజర్ చూస్తుంటే రవితేజ విక్రమార్కుడు రేంజ్ లో దేవ్ గిల్ అహూ విక్రమార్క ఉండనున్నట్లుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా రిలీజ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ క్రమంలో దేవ్ గిల్ తో పాటు ఆయన భార్య, నిర్మాత ఆర్తి, ఇతర టెక్నీషియన్స్ తమ భావాలను పంచుకున్నారు. " మగధీర నుంచి నా మీద ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. పూణె లో మా తల్లిదండ్రులు జన్మించి ఉండవచ్చు కానీ హైదరాబాద్లో రాజమౌళి గారు నాకు పేరు ఇచ్చారు. రమ గారు నాకు తల్లిలాగా సపోర్ట్ చేశారు. వారి వల్లే ఈరోజు ఈ సినిమా చేయగలిగాను " అంటూ దేవ్ గిల్ జక్కన్న భార్యపై కామెంట్స్ చేశాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: