శ్రుతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించారు. ఈమె ప్రముఖ నటుడైన కమల్ హాసన్ కూతురు. తల్లిదండ్రులు ఇద్దరు నటులు కావడంచేత నటనపె ఆసక్తి పెంచుకుంది. ఈమె 1986 జనవరి 28 చెన్నై, తమిళనాడులొ జన్మించారు. శ్రుతి హాసన్ సినీ జీవితం మెదట పరాజయాలు పలకరించినప్పటికి త్రి, గబ్బర్ సింగ్ సినిమాలు మంచి నటిగా గుర్తింపునిచ్చాయి.పవన్ కళ్యాణ్ సరసన "గబ్బర్ సింగ్" సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియూ ప్రేక్షకుల దృష్టిలో శ్రుతి హాసన్ స్థాయిని పెంచింది. తనని నటిగా తెలుగు సినిమాల్లో నిలబెట్టింది.రవితేజ సరసన "బలుపు", జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన "రామయ్యా వస్తావయ్యా" ఇలా పలు చిత్రాలలొ నటించింది. తెలుగు, తమిళ సినిమాలలో మంచి నటిగా పేరు సంపాదించుకుంది. నటిగానే కాకుండ గాయనిగా కొన్ని సినిమా పాటలు పాడారు. సినిమాల పరంగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ హీరోయిన్ సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో సిట్ చాట్ చేస్తూ ఉంటుంది.రీసెంట్ గానే తనకు బ్రేకప్ అయిన విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకోవడమే కాకుండా తాను ప్రెజెంట్ సింగిల్ గానే ఉన్నానని చెప్పింది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన శృతి హాసన్ ఓ నెటిజన్ పై విరుచుకుపడింది.సౌత్‌ ఇండియన్‌ యాసలో ఏదైనా చెప్పవా? అని ఓ నెటిజన్‌ అడగ్గా.. అందుకు శృతి ఇలా రియాక్ట్‌ అయింది. ఓకే.. ఈ రకమైన జాతివివక్షను నేను అస్సలు సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ, దోస, సాంబార్‌.. ఇలాంటి పేర్లతో పిలిస్తే మేము ఊరుకోలేము. మీరు మమ్మల్ని అనుకరించలేరు.. కాబట్టి మాలాగా ఉండాలని ట్రై చేయకండి.. ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోము.సౌత్‌ ఇండియన్‌ భాషలో ఏదైనా చెప్పమేని అడిగావు కదా.. నోరు మూసుకుని వెళ్లు అని తమిళంలో రాసుకొచ్చింది. దీంతో శృతి హాసన్ పెట్టిన ఈ రిప్లై నెట్టింట వైరల్ అవుతుంది. కాగా శృతి హాసన్ కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. గత ఏడాది 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి', 'సలార్' వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: