దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ చాలా కాలం క్రితం కమల్ హాసన్ హీరోగా సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో ఇండియన్ 2 అనే మూవీని మొదలు పెట్టాడు. ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఎంతకాలం అయినా ఈ సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ కాకపోవడంతో శంకర్, చరణ్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్ గా దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గేమ్ చెంజర్ అనే సినిమాను మొదలు పెట్టాడు.

గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత మళ్లీ కొన్ని చర్చల అనంతరం ఇండియన్ 2 సినిమాను తిరిగి మళ్ళీ ప్రారంభించారు. దానితో ఏకకాలంలో శంకర్ ఓ వైపు ఇండియన్ 2 మరో వైపు గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లను పూర్తి చేస్తూ వచ్చాడు. అందులో భాగంగా ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ఈ మూవీ ని జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో నెల రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది అని అనేక వార్తలు వచ్చాయి.

కానీ గేమ్ చేంజర్ షూటింగ్ ఈ నెల రోజుల్లో కంప్లీట్ కావడం కష్టం అని తెలుస్తుంది. ఎందుకు అంటే ఇటు ఇండియన్ 2 మూవీ రిలీజ్ కి రెడీగా ఉండడంతో శంకర్సినిమా ప్రచారాలపై ఈ నెల రోజులు ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ నెల రోజులు గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చాలా తక్కువ భాగం జరిగే అవకాశాలు ఉన్నట్లు దానితో ఈ నెల గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి కావడం కష్టం అని తెలుస్తుంది.  గేమ్ చేంజర్ మూవీ ని అక్టోబర్ 31 తేదీన లేదా డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: