తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఈ నటుడు తన కెరియర్లో కొన్ని బ్లాక్ బాస్టర్ మూవీలను కూడా వదులుకున్నాడు. అలా ఈ నటుడు వదులుకున్న ఆ బ్లాక్ బాస్టర్ మూవీలు ఏవి..? అవి ఎందుకు వదులుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

శర్వానంద్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా శతమానం భవతి అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా కథ మొత్తం రెడీ అయిన తర్వాత దిల్ రాజు దీనిని మొదటగా సాయి ధరమ్ తేజ్ కు వినిపించారట. కాకపోతే ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ ఇతర మూవీలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా చేద్దాం సార్ కాకపోతే కొంచెం టైమ్ పడుతుంది అని చెప్పాడట. దానితో దిల్ రాజు ఈ సినిమాను కచ్చితంగా సంక్రాంతి కి విడుదల చేయాలి అనుకుంటున్నాం. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలి అంటే ఇప్పుడే షూటింగ్ మొదలు పెట్టాలి. నీకు వేరే సినిమాలు ఉన్నాయి అంటున్నావు.


అలాగే ఈ సంక్రాంతి సీజన్ కి ఖైదీ నెంబర్ 150 సినిమా రిలీజ్ కి ఉంది. దానికి పోటీగా నువ్వు సినిమా రిలీజ్ చేయవు. మనిద్దరం వేరే సినిమా చేద్దాం. ఇప్పుడు దీనిని వదిలేద్దాం అని చెప్పాడట. దానితో ఈ నటుడు ఈ సినిమాను వదిలేసాడట. ఇక కార్తికేయ హీరోగా పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా అజయ్ భూపతి దర్శకత్వంలో ఆర్ఎక్స్ 100 అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కథను మొదటగా అజయ్ , సాయి ధరమ్ తేజ్ కు వినిపించాడట. ఈ కథ మొత్తం విన్న ఈ నటుడు ఇంత రఫ్ పాత్ర నేను చేయలేను సారీ అని చెప్పాడట. అలా సాయి ధరమ్ తేజ్ ఈ రెండు బ్లాక్ బాస్టర్ మూవీలను వదులుకున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

sdt