తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొద్దిరోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు కల్కి మూవీ.. ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్గా ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం నాగ్ అశ్విన్ వ్యవహరిస్తూ ఉన్నారు. కీలకమైన పాత్రలో కమలహాసన్, రాజేంద్రప్రసాద్, అమితాబచ్చన్ తదితరు నటీనటులు నటిస్తూ ఉన్నారు. కల్కి సినిమా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించే నటీనటుల రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు మరొకసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వాటి గురించి చూద్దాం.
కల్కి 2898AD సినిమా కోసం ప్రభాస్ ఏకంగా రూ .150 కోట్లు అందుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అత్యధికంగా పారితోషకం అందుకున్న హీరోగా పేరు సంపాదించారు. అలాగే దీపికసినిమా కోసంరూ .20 కోట్లు తీసుకున్నట్లు.. అమితాబచ్చన్ కమలహాసన్ కూడా ఒక్కొక్కరు రూ .20 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. దిశాపటాని రూ .5 కోట్ల రూపాయలు అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే ఇందులో నటించిన నటీనటులకు కూడా బాగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారుగా రూ.250 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


జూన్ 27వ తేదీన కల్కి సినిమా చాలా గ్రాండ్ గా విడుదల కాబోతున్నది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ని కూడా చిత్ర బృందం వేగవంతం చేస్తోంది. ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కల్కి సినిమాలో ఎన్నో విభిన్నమైన ట్విస్టులు ఉంటాయని సెన్సార్ రిపోర్టులో కూడా తెలియజేయడం జరిగింది. ఇటీవలే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా చేశారు చిత్ర బృందం అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో తిరిగి రిలీజ్ ఈవెంట్ ని చేయడానికి ఇష్టపడలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఇంతటి స్థాయిలో తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: