తమిళ స్టార్ హీరో విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తమిళంలోనే కాకుండా..తెలుగులోనూ విజయ్ కు అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు విజయ్ కెరీర్‏లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. సినిమాల్లోనూ.. బిజినెస్.. యాడ్స్ తోపాటు.. అభిమానుల విషయంలో అంతా రజినీ కాంత్ వారసుడు అంటుంటారు.. గత పది సంవత్సరాలలో విజయ్ దాదాపు 15 సినిమాల్లో నటించాడు. అందులో తొమ్మిది చిత్రాలు… రూ. 100 కోట్లకు పైగా వసూలు చేశాయి. అలాగే.. బిగిల్, సర్కార్, మెర్సల్, మాస్టర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్ల వసూలు చేశాయి.ఈ నేపథ్యంలో అభిమానులకు విజయ్ షాకింగ్ న్యూస్ తెలిపారు.తన బర్త్ డే ను సెలబ్రేట్ చేయవద్దు అంటూ అభిమానులకు ఆదేశాలు జారీ చేశాడు ఇళయ దళపతి స్టార్ హీరో విజయ్. తమిళనాట తన పుట్టినరోజు వేడుకలు చేయొద్దంటూ..రేపు అనగా 22 జూన్ తమిళ స్టార్ హీరో..విజయ్ దళపతి పుట్టిన రోజు కావడంతో.. ఉత్సవాలు చేయడానికి అభిమానులు సిద్థం అయ్యారు. అసలే కొత్తగా పార్టీ పెట్టిన తరువాత విజయ్ ఫస్ట్ బర్త్ డే కావడంతో.. తమిళనాడు వ్యాప్తంగా గ్రాండ్ గా ఉత్సవాలు చేయాలని నిర్ణయించారు. కాని అభిమానుల ఆశలు నిరాశ అయ్యేలా స్టేట్మెంట్ ఇచ్చాడు విజయ్. తన పుట్టినరోజును జరుపవద్దుఅంటు వేడుకున్నారు. కారణం ఏంటి..?విజయ్ 49వ పుట్టినరోజు జూన్ 22న అంటే రేపు జరుపుకోనున్నారు. రాజకీయ పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలి పుట్టినరోజు కావడంతో అభిమానులు, ఆయన పార్టీ కార్యకర్తలు వేడుకలు, అన్నదాన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో నటుడు విజయ్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవద్దని తన వాలంటీర్లను ఆదేశించారు.దీనికి సంబంధించి తమిళనాడు వెట్రి కజగం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ ప్రకటనను ప్రచురించారు.

సోషల్ మీడియా ఈ విధంగా పోస్ట్ కూడా పెట్టారు. పోస్ట్‌లో అధ్యక్షుడు విజయ్ తమిళనాడు వెట్రి కజగం నిర్వాహకులను ఈ విధంగా ఆదేశించారు.. తన పుట్టినరోజు వేడుకలను జరపకండి.. అన్నారు. కల్తీ సారా తాగి పదుల సంఖ్యలో మరణించిన వారి కుటుంబాలకు సంతాప సూచికంగా ఈ పని చేసినట్టు తెలుస్తోంది.అంతే కాదు.. తన పుట్టి రోజుకోసం పెట్టే ప్రతీ పైసా ఖర్చును.. బాధిత కుటుంబాలకు నేరుగా వెళ్లి.. వారికి సహాయపడాలని తమిళనాడు విక్టరీ కజగం జిల్లా నిర్వాహకులందరినీ తలపతి విజయ్ ఆదేశించారు. వారికుటుంబాలను ఆదుకోవాలని ఫ్యాన్స్ ను కోరుకున్నాడు. బాధిత కుటుంబాలను స్వయంగా కలుసుకుని వారికి అవసరమైన వైద్య సహాయం మరియు నిత్యావసర వస్తువులను వెంటనే అందించవలసిందిగా ఆయన ఆదేశించారు. ప్రస్తుతం విజయ్ నిర్ణయం తమిళనాట, కోలీవుడ్ లో సంచలనంగా మారింది. ఇక రీసెంట్ గా బాధితులను విజయ్ పరామర్శించి వచ్చారు.నటుడు విజయ్ ప్రస్తుతం గోట్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 2026లో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా ఆయన పార్టీ స్థాపించారు. ఈ కారణంగా ఇకపై సినిమాల్లో నటించనని కూడా ప్రకటించాడు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభినందనలు, విమర్శలను ఫేస్ చేస్తూ.. పార్టీని బలోపేతం చేసతున్నారు.ఇక రీసెంట్ గా తమిళనాట కల్తీ సారా తాగి పదుల సంఖ్యలో ప్రాణాలుకోల్పోయారు జనాలు. దాదాపు 50 మందికి పైగా ఈ కల్తీ సారాకు బలైపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయం తమిళనాడుతో పాటు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. రాజకీయ నాయకులతో పాటు.. సినిమా ఇండస్ట్రీ కూడా బాధితుల పక్షాణ నిలబడి.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: