పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మనందరికీ సుపరిచితమే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అనంతరం అనేక మనస్పార్ధాలు తలెత్తడంతో వీరు విడాకులు తీసుకున్నారు. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకోగా రేణు దేశాయ్ మాత్రం ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకునే సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక ఇటీవలే రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తరువాత ఏ సినిమాలోనూ నటించలేదు. ప్రెసెంట్ అనాధ పిల్లలకు అండ్ జంతువులకు సహాయం చేస్తూ గొప్ప మనసును చాటుకుంటుంది రేణు దేశాయ్.

ఇక గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఇద్దరు పిల్లలు అఖీరా అండ్ ఆధ్యాకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అకిరా తండ్రి వెంటే ఉంటూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నాడు.‌ అయితే ఈ ఫోటోలను రేణు దేశాయ్ కూడా తన సోషల్ మీడియా లో షేర్ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు కూడా. అయితే గత కొద్ది కాలంగా పవన్ కు దూరం ఉన్నప్పటికీ రేణు దేశాయ్ ని పవన్ ఫ్యాన్స్ పలు విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఎన్నోసార్లు తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది.

అయినప్పటికీ కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ ఏ పోస్ట్ పెట్టిన ఏదో ఒక కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ చెప్పే మాటలకు విసిగిపోయిన రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ పెట్టి ఫాన్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. " నా ఐఫోన్ లో భోగి మంట ఈ స్లో ‌ మోషన్ను చిత్రీకరించారు. డిసెంబర్ నుంచి దీనిపై ట్రిప్ చేస్తున్నారు. నేను ఇంకా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయలేదని మర్చిపోయాను. నేను నా మాజీ భర్తను ఎలా తిరిగి పొందాలి లేదా నేను ఇప్పటికీ తనని కోల్పోతున్నారని మీరు భావించినందున నేను ఈ పోస్ట్ ఎలా ఉంచాను అనే దానిపై ఏవైనా సలహాలు లేదా వ్యాఖ్యలు చేస్తే డిలీట్ చేస్తాను లేదా బ్లాక్ చేసి పడేస్తాను " అంటూ రాసుకు వచ్చింది రేణు దేశాయ్. ప్రజెంట్ ఈమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: