అనుష్క శెట్టి సినీ రంగంలోకి అడుగుపెట్టి 17 ఏళ్లు పూర్త‌యింది. అనుష్క త‌న‌ న‌ట‌నతో ప్రేక్ష‌కుల‌ ప్ర‌శంస‌లు పొందారు.టాలీవుడ్‌లో అనుష్క శెట్టి  న‌ట‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. యోగా ట్రైన‌ర్‌గా కెరీర్ మొద‌లు పెట్టిన అనుష్క శెట్టి అనుకోకుండా చిత్ర రంగంలోకి ప్ర‌వేశించారు. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలే కాకుండా అరుంధ‌తి లాంటి లేడీ ఒరియెంట్ చిత్రాల‌లో న‌టించి త‌న నట‌న‌కున్న ప‌వ‌ర్ ఏంటో చూపించారు.అక్కినేని నాగార్జున న‌టించిన సూప‌ర్ సినిమాతో అనుష్క శెట్టి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొద‌టి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాల్లో న‌టించి మెప్పించిన‌ అనుష్క శెట్టి.. అగ్ర క‌థానాయ‌కురాలిగా కొన‌సాగుతున్నారు. బాహుబ‌లి, అరుంధ‌తి వంటి సినిమాలతో మ‌రింత పాపుల‌ర్ అయ్యారు.లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి మళ్లీ కెరీర్ ను పరుగులు పెట్టిస్తుంది. సైజ్ జీరో సినిమా తరువాత బరువు పెరిగిన స్వీటీ..అప్పటి నుంచి సినిమాలను తగ్గించుకుంటూ వచ్చింది. మధ్యలో కొన్నేళ్లు అయితే అసలు సినిమాలు కూడా చేయలేదు. ఇక గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరోసారి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది.

ఇక దీని తరువాత యూవీ క్రియేషన్స్ లోనే మరో సినిమా చేయనుంది. ఇక ఇది కాకుండా కన్నడలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయనుంది. అరుంధతి, బాగమతి లానే ఈ చిత్రంలో కూడా పవర్ ఫుల్ పాత్రలో నటించనుందని సమాచారం. ఈ సినిమాతో పాటు ఘాటీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలతో బిజీగా మారిన స్వీటీ.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్స్ లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు.మొదటి నుంచి కూడా ఏదైనా అవసరం అయితే తప్ప ఆమె సోషల్ మీడియాను వాడదు. అది ఆమెకు మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఇక అప్పట్లో గ్లామర్ పాత్రల్లో కనిపించినా.. బయట మాత్రం అస్సలు అందాల ఆరబోత చేయని హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంతోమంది హీరోయిన్స్ అనుష్క బయట వేసుకొనే దుస్తుల ఎంపికను మెచ్చుకున్నారు కూడా. ఇక మొదటి నుంచి కూడా పాత్రకు ప్రాధాన్యత లేని సినిమాలను చేయని అనుష్క ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తోంది.

ఇక ఈ మధ్యనే ఒక స్టార్ హీరో సినిమాలో అనుష్కకు ఆఫర్ వచ్చిందంట. దానికోసం రూ. 5 కోట్లు రెమ్యూనిరేషన్ కూడా ఇస్తామని చెప్పారట. కానీ. కథలో తన పాత్రకు ప్రాధాన్యత లేదని గమనించిన ఆమె సున్నితంగా ఆ ఛాన్స్ ను రిజెక్ట్ చేసిందంట. ఈ కాలంలో హీరోయిన్స్ కొంతమంది పాత్రతో పనిలేకుండా డబ్బు వస్తే చాలు అనుకుంటున్నారు. అలాంటిది అన్ని కోట్లు ఇస్తామన్నా కూడా అలాంటి పాత్రలు చేయనని చెప్పడం చాలా గ్రేట్. ఏదిఏమైనా వ్యక్తిత్వంలో స్వీటీ చాలా గ్రేట్.. అందుకే స్వీటీ నువ్వంటే మాకిష్టం అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి స్వీటీ తన చేతిలో ఉన్న సినిమాలతో ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: