కన్నడ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో యాష్ ఒకరు. ఇక ఈయన కొంతకాలం క్రితం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 1 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ మూవీ విడుదల కంటే ముందు ఇటు యాష్ కి కానీ , అటు ప్రశాంత్ నీల్ కి కానీ కన్నడ సినీ పరిశ్రమలో తప్ప వేరే ఇండస్ట్రీలలో పెద్దగా గుర్తింపు లేదు. దానితో ఈ సినిమా పెద్ద స్థాయిలో అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయింది. విడుదల అయిన తర్వాత ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. 

దానితో ఈ మూవీ మెల్లి మెల్లిగా పుంజుకొని 80 కోట్లతో రూపొందిన ఈ సినిమా 250 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ సినిమాకి సంబంధించిన రెండవ భాగం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని మళ్లీ థియేటర్లలో రీ రిలీస్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు.

ఈ సినిమాని జూన్ 21 వ తేదీన మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఆ స్థాయి ఇంపాక్ట్ ను చూపిస్తుందో , ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి. హొంబులే ఫిలిమ్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ మూవీ లో శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటించగా ... రవి బుశ్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: