ఈ మధ్యకాలంలో జనాలు అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి కచ్చితంగా ఆ సినిమాను థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అద్భుతం అనే రివ్యూస్ వస్తేనే అలాంటి సినిమాలను థియేటర్లలో చూడడానికి ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తున్నారు. కొన్ని సినిమాలకు మంచి టాక్ వచ్చినా కూడా ఆ సినిమాలను థియేటర్లలో చూడాల్సిన అవసరం ఏమీ లేదు. అందులో గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ కానీ, వండర్ఫుల్ సన్నివేశాలు ఏమీ లేవు. 

దానిని ఓ టీ టీ లో చూసిన పర్వాలేదు అనే టాక్ వస్తే వచ్చినట్లు అయితే ఎలాగో నెల రోజుల్లో దాదాపుగా ఏ సినిమా అయినా ఓ టీ టీ లోకి వస్తుంది కనుక డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చాక ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని సినిమా చూడొచ్చు అనే ఉద్దేశంతో కొన్ని సినిమాలకు థియేటర్ల కంటే ఓ టీ టీ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక మరికొన్ని సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్స్ సన్నివేశాలు అన్నీ ఉన్నాయి. స్టార్ హీరోలు కూడా ఉన్నారు.

కానీ కథ కొంచెం వీక్ గా ఉంది అని టాక్ వచ్చిన కూడా అలాంటి సినిమాలను పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి థియేటర్లలోకి వెళ్లి చూడడం కంటే కూడా ఓ టీ టీ లో చూడడం మంచిది అని జనాలు భావిస్తున్నారు. దానితో కొన్ని అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలకు కూడా థియేటర్లలో కంటే ఓ టీ టీ లో మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇక అలాంటి సినిమాలు లిస్టులోకే బాలీవుడ్ సినిమా బడే మియా చోటే మియా చేరింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ శార్ఫ్ హీరోలుగా నటించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లో విడుదల అయింది.

ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు యావరేజ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా పెద్ద మొత్తంలో కలక్షన్లను వసూలు చేయలేకపోయింది. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ ప్రస్తుతం ఇండియాలో నెంబర్ 1 ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమా ఓ టీ టీ లో మాత్రం అద్భుతమైన జోష్ లో ముందుకు సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

hr