అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం అక్కరలేదు. ఈమె కన్నడ సినిమా కిరాక్ పార్టీ తో మంచి విజయం అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత  ఈమే కన్నడ సినీ పరిశ్రమలో కొనసాగకుండా తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఛలో తోనే సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు గీత గోవిందం  తో మరో విజయం దక్కింది.

ఈ సినిమాల తర్వాత ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు తగ్గడంతో చాలా తక్కువ కాలంలోనే రష్మిక తెలుగులో టాప్ హీరోయిన్ అయింది. కొంతకాలం క్రితం ఈనటి పుష్ప పార్ట్ 1 సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల అయ్యి సూపర్ సక్సెస్ కావడంతో ఇండియా వ్యాప్తంగా రష్మిక కి గుర్తింపు లభించింది. దానితో ప్రస్తుతం ఈమెకు వరుస హిందీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుబోయే సికిందర్ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా కనిపించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కోసం ఈమె భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించడం కోసం ఈమె మొదటగా 15 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా, మూవీ బృందం వారు 13 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు ఈమె కూడా ఆ ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా సికిందర్ సినిమా కోసం రష్మిక అదిరిపోయే రేంజ్ పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమె ప్రస్తుతం చాలా సినిమాలలో నటిస్తోంది. ఆ సినిమాలలో చాలా చిత్రాలు కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈమె క్రేజ్ అలాగే రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: