ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్న వారిలో లోకేష్ కనకరాజు ఒకరు. ఈయన మా నగరం అనే మూవీతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఖైదీ సినిమాతో సూపర్ సక్సెస్ను అందుకోవడం మాత్రమే కాకుండా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత లోకేష్ దర్శకత్వం వహించిన మాస్టర్, విక్రమ్, లియో సినిమాలు కూడా మంచి సక్సెస్ లు కావడంతో ఈయన ప్రస్తుతం ఇండియాలోనే అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు.

లోకేష్ కనకరాజు ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందుతున్న కూలీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ తర్వాత లోకేష్ కనకరాజు ఎవరితో సినిమా చేస్తాడా అనేదే సస్పెన్స్ గా మారింది. ఎందుకు అంటే ఇప్పటికే లోకేష్ ఖైదీ మూవీకి కొనసాగింపు ఖైదీ 2, విక్రమ్ మూవీకి కొనసాగింపుగా విక్రమ్ 2, లియో మూవీకి కొనసాగింపుగా లియో 2 సినిమాలను చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు.

కానీ కూలి సినిమా తర్వాత ఈయన ఏ హీరోతో ఏ సినిమాకు కొనసాగింపుగా మూవీ చేయబోతున్నాడు అనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు. దానితో కార్తీతో ఖైదీ 2 తీస్తాడు అని కొంతమంది అంటే, కమల్ హాసన్ తో విక్రమ్ 2 తీస్తాడు అని మన కొంత మంది, విజయ్ తో లియో 2 తీస్తాడు అని మరి కొంత మంది అంటున్నారు. మరి ఈ దర్శకుడు ఎవరితో తన తదుపరి మూవీని చేస్తాడా అనేది ఎవరికి క్లారిటీ రావడం లేదు. మరి లోకేష్ ఈ మూడు సినిమాల్లో ఏ సినిమాకు కొనసాగింపుగా తన తదుపరి సినిమాను చేస్తాడా... లేదా కొత్త కథతో, కొత్త హీరోతో వేరే ఏదైనా సినిమా చేస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: