సీనియర్ హీరోల్లో ఒకరైన వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలను చేస్తూ ఇప్పటికి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే ఆయన దృశ్యం దృశ్యం 2 నారప్ప వంటి సినిమాల్లో మిడిల్ ఏజ్ ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఆ సినిమాల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ స్థాయిలో విజయాన్ని అందుకోవడం వెంకటేష్ కి కొత్తమీ కాదు. ఇక ఇది మల్టీస్టారర్ సినిమా. మెగా హీరో

 వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాకి సీక్వెల్ గా ఎఫ్ 3 కూడా వచ్చింది. ఇది కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ ఏడాది సైంధవ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెంకీ మామ. చాలా గ్యాప్ తర్వాత కమర్షియల్ సబ్జెక్టుతో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఊహించని స్థాయిలో ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఊహించన స్థాయిలో ఫ్లాప్ గా మిగిలింది. ఇక ఎటువంటి కమర్షియల్ సినిమాలు చేస్తే లాభం లేదు అని మళ్లీ కామెడీ ఎంటర్టైన్మెంట్

 సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు వెంకటేష్. దర్శకుడు అనిల్ రావిపూడితో ముచ్చటగా మూడోసారి జతకడుతున్నాడు. ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే విచిత్రమైన టైటిల్ నిర్ణయించారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తెరకెక్కనుంది. ప్రీ ప్రొడక్షన్ జరుగుతుండగా త్వరలో షూటింగ్ మొదలు కానుంది. కాగా దర్శకుడు అనిల్ రావిపూడి హీరో వెంకీ కోసం హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నాడట.  మొదట మీనాక్షి చౌదరిని అనుకున్నారు. ఆమెను తప్పించి ఐశ్వర్య రాజేష్ కి ఛాన్స్ ఇచ్చారంటూ ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే యంగ్ హీరోయిన్ తో వెంకీ రొమాన్స్ చేయాల్సి వస్తుంది. ఐశ్వర్య రాజేష్ పై లుక్ టెస్ట్ కూడా నిర్వహించారు. ఆమె ఈ చిత్రంలో పాత్రకు చక్కగా సరిపోతుందని భావించారట. ఈ క్రమంలో ఐశ్వర్య రాజేష్ కి ఛాన్స్ దక్కిందని అంటున్నారు.!!

మరింత సమాచారం తెలుసుకోండి: