మరో వారం రోజుల్లో కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. జూన్ 27న ఎంతో గ్రాండ్గా విడుదల అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు చిత్ర బృందం. ఒకవైపు ఈ సినిమాలో కీలకంగా కనిపించబోయే బుజ్జి కారు ప్రస్తుతం దేశమంతా తిరుగుతోంది. మరోవైపు చిత్ర బృందం సైతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ కూడా చెబుతూ డైరెక్టర్ నాగ్ అశ్విన్  వీడియోలని సైతం సోషల్ మీడియాలో విడుదల

 చేస్తున్నారు. ఇకపోతే ఈరోజు సాయంత్రం కలికి నుండి సెకండ్ ట్రైలర్ కూడా రాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు చిత్ర బృందం. కాగా ఇటీవల ముంబైలో కల్కి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చేశారు నిర్వాహకులు.  ఆ ఈవెంట్ కి ప్రభాస్ దీపిక పదుకొనే అమితాబచ్చన్ కమలహాసన్ అందరూ వచ్చారు. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా దగ్గుబాటి రానా వారందరినీ పలు ప్రశ్నలు అడిగారు. అయితే ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈవెంట్

 మొత్తానికే చాలా హైలైట్ గా కనిపించింది ఎవరు అంటే దేవికా పదుకొనే అని చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఆమె తన బేబీ బంప్ తో కనిపించింది. దాంతో ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఈవెంట్లో దీపిక ధరించిన డ్రెస్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. లోవే బ్రాండ్ కు చెందిన సింపుల్ బ్లాక్ ట్రెండీ డ్రెస్ సెలక్ట్ చేసుకుంది దీపికా. ఆ డ్రెస్ ధర రూ.1.14 లక్షలు అని సమాచారం. అంతేకాకుండా ఆమె Magda Butrym బ్రాండ్ స్టైలీష్ చెప్పులు ధరించింది. వాటి విలువ రూ.41.500. ఇక దీపిక ధరించిన కార్టియర్ ఆభరణాల విలువ రూ.1.16 కోట్లు. ఆమె మణికట్టుకు ధరించిన మూడు డైమండ్స్ ఉన్న బ్రాస్ లెట్ అందరి దృష్టిని ఆకర్షించింది. పాంథెర్ డి కార్టియర్ బ్రాస్‌లెట్‌ అద్భుతమైన భాగం. పచ్చలు, వజ్రాలతోపాటు 18k తెల్ల బంగారంతో తయారు చేసిన ఈ అద్భుతమైన బ్రాస్ లెట్ విలువ రూ.53,50,000..!!

మరింత సమాచారం తెలుసుకోండి: