ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీ దేవి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ల మొదటి కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. తాజాగా జాన్వి కపూర్ ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఈమె ఒక పల్లెటూరు అమ్మాయి

 పాత్రలో కనిపించబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇక జాహ్నవి కపూర్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన ఫోటోలని వీడియోలని ప్రతి ఒక్క అప్డేట్ కూడా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఇతనికి సంబంధించిన పలు లేటెస్ట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో తెల్లటి లంగా ఓణీలో

 దివి నుండి దిగివచ్చిన దేవకన్య లాగా వయ్యారాల జాబిల్లి ఓని కడితే ఎలా ఉంటుందో అలా కనిపించింది జాన్వికపూర్. లేటెస్ట్గా తన ఆనందాలను లంగా వోనిలో సోషల్ మీడియాలో పంచుకుంది. దాంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆమె పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాలో ఉన్నట్లుండి అశ్లీల చిత్రాలు కనిపించాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. జాన్వీ ఖాతాలో ఇలాంటి ఫోటోస్ ఏంటీ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో వెంటనే జాన్వీ పర్సనల్ అలర్ట్ అవుతూ దీనిపై క్లారిటీ ఇచ్చింది. జాన్వీకి అసలు ఎక్స్ అకౌంట్ లేదని.. ఆమె పేరుతో ఉన్న ఫ్యాన్ అకౌంట్ ద్వారా ఫోటోస్ షేర్ అయినట్లు తెలిపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: