యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ తో దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ ద్వారా ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దానితో వీరిద్దరూ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలపై దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీని మొదట అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రచారాలను కూడా చేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులు ఫుల్ స్పీడ్ గా పూర్తి అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ముందు చెప్పిన అక్టోబర్ 10 వ తేదీ కంటే కొంతముందే అనగా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల క్రితమే పుష్ప పార్ట్ 2 మూవీకి సంబంధించిన షూటింగ్ను మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత చాలా రోజులు విడుదలకు ఉండడంతో ఈ మూవీ కచ్చితంగా చెప్పిన తేదీకి వస్తుంది అని జనాలు అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన కాకుండా డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. దానితో ఎన్టీఆర్ "దేవర" సినిమా సూపర్ స్పీడ్ గా పూర్తి అయింది. అనుకున్న దానికంటే ముందుగా వచ్చేస్తుంది. అల్లు అర్జున్ "పుష్ప 2" సినిమా మాత్రం వస్తుంది అనుకున్న సమయం కూడా రావడం లేదు అని అల్లు అర్జున్ అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: