యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ అనౌన్స్ అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఓ వైపు ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా సమయాన్ని గడుపుతుండటం, అలాగే ప్రశాంత్ నీల్ కూడా వరుస సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో వీరిద్దరి సినిమా ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మొదటి భాగం షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అలాగే వార్ 2 సినిమా షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లో కంప్లీట్ కానుంది.

ప్రశాంత్ నీల్ ఇప్పటికే సలార్ పార్ట్ 1 మూవీ విడుదల చేసి మంచి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం సలార్ 2 కి సంబంధించిన షూటింగ్ ను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం వీరి సినిమాల షూటింగ్ ల స్పీడ్ ను బట్టి చూస్తే మరో మూడు, నాలుగు నెలలు వీరు ఫుల్ ఫ్రీ కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో వీరి కాంబో మూవీ సెట్స్ పైకి మరో నాలుగు, ఐదు నెలల్లో వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

మూవీ లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యూరప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు , ఇందులో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హిందీ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు. అద్భుతమైన క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఇప్పటి నుండే భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: