టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ తాజాగా మనమే అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కృతి శెట్టి ఈ మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ జూన్ 7వ తేదీన థియేటర్లో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మిక్స్ డ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు కలెక్షన్లు తగ్గాయి. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు.

కానీ అనూహ్యంగా ఈ సినిమా వీక్ డేస్ లో పుంచుకోవడం మొదలు పెట్టింది. దానితో ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 14 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 14 రోజుల్లో కూడా ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. దానితో ఈ మూవీ ఇప్పటికే క్లీన్ హిట్ కి అతి దగ్గరగా వచ్చింది. మరి 14 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయి కలెక్షన్లు వచ్చాయి. మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకోవడానికి ఎంత దూరంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

14 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.58 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 87 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 3.76 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 14 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.21 కోట్ల షేర్ ... 15.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 14 రోజుల్లో 59 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1.11 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 14 రోజుల్లో 9.91 కోట్ల షేర్ ... 19.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 9 లక్షల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: