ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో తీసిన మూవీ ‘కల్కి 2898’ ఈ మూవీ పై నిర్మాత అశ్వినీ దత్త 6 వందల కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు. అత్యంత భారీ స్థాయిలో మార్కెట్ అయిన ఈ మూవీ బయ్యర్లు లాభాలా బాట పట్టాలి అంటే కనీసం 1000 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రావాలి అంటున్నారు. ప్రభాస్ మ్యానియాతో పాటు ఈ మూవీలో అమితా బచ్చన్ కమలహాసన్ దీపికా పదుకొనె లాంటి ఎందరో హేమాహేమీలు ఈ సినిమాలో నటిస్తూ ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఇది అంతా నాణానికి ఒకవైపు మాత్రమే కనిపించే విషయం. అయితే ఈ మూవీ కథ సగటు ప్రేక్షకుడుకి అర్థం అవుతుందా అన్న సందేహాలు చాలామందికి వస్తున్నాయి. హాలీవుడ్ స్టైల్ తగ్గని సైన్స్ ఫిక్షన్ కథకు మైథాలజీ టచ్ ఇచ్చి ఈ చిత్రాన్నినాగ్ అశ్విన్ ఒక డిఫరెంట్ గా తీసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈమూవీలో కనిపించే విజువల్స్ అద్భుతంగా ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహంలేదు.ఈసినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్ లు ప్రోమోలు సగటు ప్రేక్షకుడు ఎన్నిసార్లు చూసినా అతడికి ఈమూవీ కథ అర్థం కావడంలేదు అన్న ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ గా ముంబాయిలో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈమూవీ కథను విడమరిచి చెప్పినప్పటికీ ఈ కథ విషయంలో సగటు ప్రేక్షకుడు ఇప్పటికైతే ఒక క్లారిటీకి రాలేకపోతున్నాడు అన్నవార్తలు వస్తున్నాయి.క్రేజీగా కథ వ్రాయడం బాగానే ఉన్నప్పటికీ ఆకథను కేవలం మూడు గంటలలో సగటు ప్రేక్షకుడుకి అసహనం కలగకుండా నాగ్ అశ్విన్ ఎంతవరకు తీసి మెప్పించగలిగాడు అన్న విషయం ఈమూవీ విడుదల అయితే కానీ తెలియదు. ఈకథను నాగ్ అశ్విన్ కన్విన్సింగ్‌ గా తీయగలిగితే ఈమూవీ ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది మరేమవుతుందో వేచి చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: