తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో అడవి శేషు ఒకరు. ఈయన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఆ తర్వాత ఈయన క్షణం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ నటుడికి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నుండి ఈయన హీరోగా మాత్రమే సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా క్షణం మూవీ నుండి ఆఖరుగా ఈయన నటించిన హిట్ 2 సినిమా వరకు ఇతను నటించిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో ఈయనకు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది.

 ప్రస్తుతం ఈ నటుడు డెకాయిట్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ నటుడు ఈ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో తన అసలు పేరును బయటపెట్టాడు. అలాగే తన ఒరిజినల్ నేమ్ ను ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. తాజాగా అడవి శేషు మాట్లాడుతూ... తన వసలి పేరు సన్నీ చంద్ర అని చెప్పాడు. అమెరికాలో ఉన్నప్పుడు నా పేరు చూసి చాలా మంది ఏడిపించేవారు.

అక్కడ ఆరెంజ్ ఫ్లేవర్ లో సన్నీ డిలైట్ అనే ఒక జ్యూస్ ఉండేది. అలాగే అప్పట్లో సన్నీ లియోన్ కూడా చాలా పాపులర్. ఆమె పేరుతో కూడా నన్ను ఏడిపించేవారు. దీనితో ఈ విషయాన్ని మా నాన్నకు చెప్పాను. అయితే ఆయన శేష్ అనే పేరు వాడుకో అని సూచించాడు. దానితో నాకు ఏమీ అర్థం కాలేదు. నేను సునీల్ గవాస్కర్ అభిమానిని కాబట్టి సన్నీ అని పేరు పెట్టాను. పూజారి శ అనే అక్షరంతో పేరు ఉండాలని చెప్పారు. అలా నీకు శేషు అనే పేరు కూడా ఉందన్నాడు. అప్పటి నుండి నా పేరు శేషు గా మారింది అని తాజాగా ఈ నటుడు తన అసలు పేరు గురించి , అది మార్చుకోవడానికి గల కారణాలను వివరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: