మెగాస్టార్ చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకుండానే తండ్రి ఇన్ఫ్లుయెన్స్ తో భారీ పాపులారిటీ సంపాదించుకుంది.. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే వ్యక్తిగత కారణాల వల్ల మరింత ఇమేజ్ దక్కించుకున్న శ్రీజ.. శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించిన విషయం తెలిసిందే. అయితే ఇతడిని వివాహం చేసుకోవడానికి.. కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేసింది.. కానీ వారు అంగీకరించలేదు.. దీంతో కుటుంబాన్ని ఎదిరించి శిరీష్ భరద్వాజతో వెళ్లిపోయింది. అంతేకాదు తనను బెదిరిస్తున్నారని.. తన కుటుంబం నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టింది.. ముఖ్యంగా తన తండ్రి చిరంజీవి , బాబాయ్ పవన్ కళ్యాణ్ లపై కూడా కేస్ పెట్టిందని అప్పట్లో వార్తలు వినిపించాయి..


అప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో కష్టపడి ఎంతో పేరు సంపాదించుకున్న మెగా కుటుంబం పరువు మొత్తం ఈ విషయంతో కుప్పకూలిపోయిందని చెప్పవచ్చు. అలా ప్రేమించిన వాడి కోసం ఏకంగా సినీ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న తన సొంతం కుటుంబం పరువు తీసి.. అతడితో వెళ్లిపోయింది . ఇక వివాహం తర్వాత శిరీష్ భరద్వాజ్ తో కొంతకాలం సమయం గడిపిన ఈమెకు ఒక పాప జన్మించింది.. పాప జన్మించిన తర్వాత అతడి అసలు స్వరూపం బయటపడింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.. 50 లక్షల రూపాయలు కట్నంగా తీసుకురావాలని వేధించాడట..  అంగీకరించకపోయేసరికి శారీరకంగా హింసించాడట.. ఇలా ఎన్నో బాధలు భరించిన శ్రీజ.. తనను ట్రాప్ చేశాడని తెలుసుకొని.. ప్రేమించిన వాడే మోసం చేయడంతో తట్టుకోలేక.. చివరికి తండ్రి వద్దకు చేరింది..

ఇక కూతురు కాబట్టి అన్నింటిని దిగమింగుకున్న చిరంజీవి.. కూతుర్ని ఆదరించారు.. ఇక ఎలాగైనా సరే శిరీష్ భరద్వాజ్ నుంచి దూరం చేయాలని శ్రీజ తో విడాకులు ఇప్పించారు  చిరంజీవి. ఇక విడాకుల అనంతరం కొంతకాలం కుటుంబం తోనే ఉన్న శ్రీజా కు మళ్లీ అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న కళ్యాణ్ దేవ్ ని ఇచ్చి వివాహం చేయగా.. అతడితో కూడా ఒక కూతురికి జన్మనిచ్చింది శ్రీజ.. ఇప్పుడు ఆయనతో కూడా ఉండలేక ఒంటరిగా వున్నట్టు సమాచారం. ఏదేమైనా ప్రేమించిన వాడి కోసం కుటుంబాన్ని కాదని.. వెళ్లిపోయింది.. చివరికి అతడిని భరించలేక తండ్రి వద్దకు చేరింది శ్రీజ.. ఇకపోతే శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ఇటీవల లంగ్స్ ఇన్ఫెక్షన్తో తుది శ్వాస విడిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: