కే జి ఎఫ్ సిరీస్ మూవీ లతో ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా ప్రశాంత్ నీల్ గుర్తింపును సంపాదించుకున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ "కే జి ఎఫ్" సిరీస్ మూవీల తర్వాత ప్రభాస్ హీరోగా సలార్ సిరీస్ మూవీలను మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఇప్పటికే సలార్ మొదటి భాగం విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా సలార్ రెండవ భాగం ను ప్రశాంత్ నిల్ రూపొందిస్తున్నాడు. ఇకపోతే చాలా కాలం క్రితమే ప్రశాంత్ , ఎన్టీఆర్ హీరోగా ఓ మూవీ ని తెరకెక్కించనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

ఇక సలార్ 2 సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి మరికొంత కాలంలోనే ఎన్టీఆర్ తో సినిమా ప్రారంభించాలి అని ప్రశాంత్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రశాంత్ ఫుల్ స్పీడ్ లో పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే కొంతమంది నటీనటులను కూడా ప్రశాంత్ సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళితే ప్రశాంత్ , ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే టైటిల్ తో మూవీ ని చేయబోతున్నట్లు , ఈ సినిమాలో రష్మిక మందన ను హీరోయిన్గా , బాబి డియోలను విలన్ గా తీసుకోవాలి అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కొంతకాలం క్రితం విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన యానిమల్ మూవీలో కూడా రష్మిక మందార హీరోయిన్గా నటించగా , బాబి డియోల్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు. ఇలా కొంత కాలం క్రితమే యానిమల్ సినిమాలో నటించిన రష్మిక మందన, బాబి డ్యూయల్ మరోసారి డ్రాగన్ మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎన్టీఆర్, ప్రశాంత్ కాంబోలో తెరకెక్కబోయే మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

srv