సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కి అవకాశాలు రావాలి అంటే ఏం పనులు చేయాలి అన్న విషయం గురించి అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..కేవలం అందం -నటన - టాలెంట్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అయిపోతారా ..?నో వే . అలా అందం - నటన - టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఉండొచ్చు కానీ అలాంటి హీరోయిన్స్ కొన్ని కమిట్మెంట్లు ఇస్తేనే పెద్ద స్టార్ హీరోయిన్స్ గా మారగలరు . ఈ విషయాన్ని చాలామంది హీరోయిన్స్ ఓపెన్ గానే చెప్పేశారు . ఎంత అందంగా ఉన్న టాలెంట్ ఉన్నా సరే కొందరు డైరెక్టర్స్ మేకర్స్ కోరికలు తీరిస్తేనే ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తారు అని ఓపెన్ గా పేర్లతో సహా బయటపెట్టిన హీరోయిన్స్ బోలెడు మంది ఉన్నారు .అయితే తాజాగా అదే లిస్టులోకి వచ్చేసింది నాగార్జున లక్కీ బ్యూటీ ఇషా కొప్పికర్. ఈ పేరు చెప్తే ఇప్పటి జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ ఒకప్పుడు జనాలకు మాత్రం ఈ బ్యూటీ ఓ దేవత ..తెరపై కనిపిస్తే చాలు షర్ట్స్ తీసేసి మరి చించేసి అరిచేసే రేంజ్ లో ఆమె అందం ఉంటుంది . హిందీ - తెలుగు - తమిళ్ - కన్నడ పరిశ్రమల్లో సినిమాలు చేసి తనకంటూ ఒక స్థాయిని క్రియేట్ చేసుకుని ఇండస్ట్రీని దున్నేసిందనే చెప్పాలి . చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పటికీ అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది అంటే కారణం మాత్రం ఆమె అందం ..ఆమె టాలెంట్ అని చెప్పాలి .

ఇప్పుడు ఈమెకు 47 ఏళ్లు ఇప్పటికీ గ్లామర్ డాల్ గా తనదైన స్టైల్ లో మెప్పిస్తుంది . తెలుగు సినిమాలతో కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈషా కొప్పికర్.. నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమాలో అద్దిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది . ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి ప్రేమతో రా సినిమాలో కూడా నటించింది . రీసెంట్గా నిఖిల్ తో కేశవ సినిమాలో కూడా నటించింది . ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈషా కొప్పికర్..రీసెంట్గా షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది .తనకు 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . ఒక ప్రముఖ నటుడు ఆమెను డైరెక్ట్ గానే సంప్రదించి ఒంటరిగా కలవాలి అని చెప్పుకొచ్చాడట . తనతో పాటు అసలు తన డ్రైవర్ కూడా రాకూడదు అంటూ కండిషన్ పెట్టాడట . అప్పటికే నాకు సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను కలవడానికి వెళ్లలేదని .. వెళ్లి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కూడా నాకు తెలుసు అని ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి అని సెన్సేషనల్ విషయాన్నీ బయటపెట్టింది . అయితే ఇంతకీ ఓపెన్ గా ఇషాను అలా పిలిచిన స్టార్ హీరో ఎవరా అంటూ జనాలు ఆలోచనలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: