సినిమా పరిశ్రమలో కొన్ని సార్లు కొంతమంది నటీనటులు సినిమా స్టోరీ బాగున్నా కానీ వారి ఈమేజ్ తగదు అని కొన్ని సినిమాలను వదులుకుంటూ ఉంటారు. ఇక మరికొన్ని సందర్భాలలో సినిమా కథ చెప్పినప్పుడు పెద్ద గొప్పగా ఏమీ అనిపించక పోయిన, తీసే విధానంలో దర్శకుడు తన ప్రతిభను అత్యున్నత స్థాయిలో కనబరిచి ఆ సినిమాకు అద్భుతమైన విజయం తీసుకువెళ్లిన సందర్భాలు కూడా ఉంటాయి.

ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ కొంత కాలం క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా , రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

ఇకపోతే మొదటగా బుచ్చిబాబు , ఆర్ సి 16 వర్కింగ్ టైటిల్ తో రూపొందబోయే సినిమా కథను ఎన్టీఆర్ కి వినిపించినట్లు, ఆయన ఈ సినిమా కథను విన్న మొదటి దశలో బాగానే ఉంది అని అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ మూవీ ఫుల్ కథ విని ఆయన సాటిస్ఫై కాకపోవడంతో ఆ సినిమాను రిజెక్ట్ చేసినట్లు, దానితో బుచ్చిబాబు, రామ్ చరణ్ ను కలవడం, ఈ స్టోరీ వినిపించడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అలా ఈ సినిమా సెట్ అయినట్లు వార్తలు వచ్చాయి.

ఇకపోతే రామ్ చరణ్ తో బుచ్చిబాబు తీయబోయే సినిమా కథ గురించి కన్నడ హీరో శివ రాజ్ కుమార్ , తమిళ హీరో విజయ్ సేతుపతి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. ఆ కథ సూపర్, బ్లాక్ బాస్టర్ కంపల్సరీ అని వారు అన్నారు. ఇలా ఎంతోమంది ఈ సినిమా కథ సూపర్ అన్నా కానీ ఎన్టీఆర్ దానిని రిజెక్ట్ చేశాడు అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: