తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వరుణ్ సందేశ్ ఒకరు. ఈయన హ్యాపీ డేస్ మూవీ తో సూపర్ సక్సెస్ ను , తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన కొత్త బంగారులోకం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈ నటుడు తిరుగులేని స్థాయికి తెలుగులో వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత నుండే ఈయనకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చిన అందులో ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి స్థాయి విజయాన్ని అందుకోలేదు.

దానితో ఈయన గ్రాఫ్ మెల్లిమెల్లిగా పడిపోతూ వచ్చింది. దానితో కొన్ని సంవత్సరాలు పాటు ఈయనకు పెద్దగా సినిమా అవకాశాలు కూడా ఏమీ రాలేదు. మళ్లీ పుంజుకున్న ఈయన వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కొంతకాలం క్రితమే ఈయన నటించిన చిత్రం చూడరా అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో వరుణ్ సందేశ్ ప్రేక్షకులను బాగా అలరిస్తాడేమో అని కొంతమంది జనాలు అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇకపోతే ఈ నటుడు తాజాగా నింద అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ మూవీ నిన్న అనగా జూన్ 21 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాతో నైనా వరుణ్ మంచి విజయం అందుకొని ఫామ్ లోకి వస్తాడు అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఈ సినిమాకు కూడా మిక్స్ డ్ టాక్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు ది కానిస్టేబుల్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి అయ్యింది. ఆర్యన్ సుభాష్ ఎస్ కే దర్శకత్వం వహించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో అయినా ఈ నటుడు మంచి విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో యువ నటులుగా కెరీర్ను కొనసాగిస్తున్న కిరణ్ అబ్బవరం, ఆది కూడా ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన భారీ స్థాయి విజయాలను అందుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs