మంచు మోహన్ బాబు గారాల పట్టి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్ గా నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మంచు లక్ష్మి ప్రెసెంట్ ఇండస్ట్రీకి దూరంగా సోషల్ మీడియాకి దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రీలోకి తిరిగి అడుగు పెట్టేందుకు కసరత్తులు చేస్తుంది. ఇక ప్రజెంట్ ఎటువంటి సినిమా అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో రెండు చేతుల నిండా సంపాదిస్తుంది మంచు లక్ష్మి.

ఇక ఇదిలా ఉంటే ఇటీఫ్లే ఎలక్షన్స్ హడావిడి ముగిసిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఎవరిది విజయం? ఎవరిది ఓటమి? అనే సందేహణలు ఉన్నాయి. ఇక ఎట్టకేలకు వీటికి అడ్డుకట్ట పడింది. జనసేన, టిడిపి, కాంగ్రెస్ కలిసి కూటమిగా తయారయ్యి ఘన విజయం సాధించారు. ఇక టిడిపిలో పలువురు ఇండస్ట్రీకి చెందినవారు కూడా ఉన్న సంగతి తెలిసిందే. వారిలో లెజెండ్రీ నటుడు బాలయ్య కూడా ఒకరు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు.

ఇక తాజాగా ప్రమాణస్వీకారం కూడా చేశాడు బాలకృష్ణ. ఈ సందర్భంగానే.. నందమూరి బాలకృష్ణ అనే నేను.. అనే మాట కోసం ఎంతోమంది ఎదురుచూశారు. ఇందులో మంచు లక్ష్మి కూడా ఒకరు. తాజాగా.. జై బాలయ్య.. మూడోసారి ఘనవిజయం.. అంటూ ట్వీట్ చేసింది మంచు లక్ష్మి. ప్రజెంట్ ఈట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేవిధంగా బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మణి సైతం.." నాన్న నువ్వు ఎప్పుడు ప్రజల హీరోవి. కథానాయకుడిగా, ప్రజా నాయకుడిగా, నిరంతరం ప్రజల హృదయాల్లో ఉంటాంవు. వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తావు. ఆల్ ది బెస్ట్ నాన్న " అంటూ ట్వీట్ చేసింది. ప్రజెంట్ వీరి ట్వీట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరి ట్రీట్స్ చూసిన వారంతా.. సినీ ఇండస్ట్రీలో లేని చిరునవ్వులు మళ్లీ తిరిగి వచ్చాయి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: