సినిమా హీరోలు అంటే వారి రేంజ్ వేరు. వారు ఉండే ఇల్లు దగ్గర నుండి నడిపే కారు , బైక్ , వేసుకునే డ్రెస్ దాదాపు అన్ని ఎంతో కాస్లీగా ఉంటాయి. ఏదో ఒకరిద్దరూ హీరోలు మినహాయిస్తే చాలా వరకు అందరూ కూడా అద్భుతమైన లగ్జరీస్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక అంత గొప్ప లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వారికి పని వారు కూడా అంతే రిచ్ గా ఉండాల్సి ఉంటుంది. దానితో కొంత మంది హీరోలు తమ దగ్గర ఉండే పని వాళ్లకు రోజుకు లక్షల్లో డబ్బులు ఇచ్చి మరి ఉంచుకుంటారు.

ఇకపోతే హిందీ సినీ పరిశ్రమలో ఓ స్టార్ హీరో దగ్గర పని చేసే ఓ వ్యక్తి కి రోజుకు రెండు లక్షల జీతం అని ఓ దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఎవరు ఏ దర్శకుడు... ఆయన ఆ పని వ్యక్తి గురించి ఏమి చెప్పాడు అనే వివరాలను తెలుసుకుందాం. హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో అనురాగ్ కశ్యప్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో బాగంగా అనురాగ్ మాట్లాడుతూ ... నేను కొంత కాలం క్రితం ఓ సినిమా చేశాను. ఆ సినిమాలోని హీరో దగ్గర ఒక వంట మనిషి ఉండేవాడు. ఆ వంట మనిషికి రోజుకు జీతం రెండు లక్షల రూపాయలు. రెండు లక్షల జీతం తీసుకుని ఆయన వండేది పిట్ట తినేంత భోజనం. ఆ కాస్త భోజనం వండడానికి ఆయన రోజుకు రెండు లక్షలు తీసుకునేవాడు. అని అనురాగ్ కశ్యప్ తాజాగా చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ దర్శకుడు చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: