టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయి. అలా వెంకటేష్ నటించిన బ్లాక్ బాస్టర్ సినిమాలలో నువ్వు నాకు నచ్చావ్ మూవీ ఒకటి. 2001 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ లో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా , విజయ్ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ మరియు స్క్రీన్ ప్లే ను అందించాడు.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన నువ్వు నాకు నచ్చావ్ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన వివరాలను చెప్పుకొచ్చాడు. అందులో భాగంగా ఈయన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని కేవలం ఐదు నిమిషాల సన్నివేశం కోసం ఐదు నెలలు వెయిట్ చేయవలసి వచ్చింది అని కూడా ఆయన చెప్పాడు. అసలు ఆ సీన్ ఏంటి ..? ఎందుకు అన్ని నెలలు వెయిట్ చేయవలసి వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

తాజాగా విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ... నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ప్రకాష్ రాజ్ అన్నం తింటున్నప్పుడు డైనింగ్ టేబుల్ వద్ద తన అమ్మ గురించి ఒక కవిత వినిపిస్తాడు. ఆ సన్నివేశంలో చాలా మంది నటీనటులు ఉండాలి. కానీ మేము ఆ సీన్ అనుకున్న తర్వాత కొంత మంది నటీనటులు వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాను కచ్చితంగా అందరి కాంబోలో చేయాలి కాబట్టి ఐదు నెలలు వెయిట్ చేసి చివరగా ఆ సన్నివేశాన్ని తీశాం అని ఆయన తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాలోని ఈ ఐదు నిమిషాల సన్నివేశం అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: