ఎన్నో సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన దర్శకులు బాలీవుడ్ పై మక్కువ కాస్త ఎక్కువగా చూపిస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. దానికి ప్రధాన కారణం బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎక్కువ మార్కెట్ ఉండడం కూడా కావచ్చు. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈ ట్రెండు మరింత ఎక్కువ అయింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ జనరేషన్ కు సంబంధించిన ఎంతో మంది దర్శకులు బాలీవుడ్ హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగా సందీప్ రెడ్డి వంగా తాను దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

ఈ సినిమాను ఆ తర్వాత షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమిక్ చేశాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో సందీప్ కి హిందీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఆ తర్వాత జెర్సీ మూవీ దర్శకుడు అయినటువంటి గౌతమ్ తిన్ననూరి "జెర్సీ" మూవీ నే హిందీ లో షాహిద్ కపూర్ హీరోగా జెర్సీ అనే టైటిల్ తోనే రీమేక్ చేశాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇక హిట్ సిరీస్ మూవీలతో శైలేష్ కొలను అద్భుతమైన గుర్తింపు తెలుగులో సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ ని హిందీలో ఇదే పేరుతో ఈ దర్శకుడు రీమిక్ చేశాడు. ఈ మూవీ హిందీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే ఈ లిస్టులోకే టాలీవుడ్ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా చేరబోతున్నాడు. ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని హిందీ నటుడు అయినటువంటి బాబి డియోల్ తో చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ దర్శకుడికి హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: