ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయింది. ఫేమ్ కోసం ఎవరు పడితే వారు ఏది పడితే అది చేసేస్తున్నారు.తీన్మార్ వార్తలు ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో శివ జ్యోతి ఒకరు తీన్మార్ వార్తలను తెలంగాణ యాసలో గలగల చదివేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి శివ జ్యోతి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం తీన్మార్ వార్తలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా  ఉంటున్నారు.యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తన భర్తతో కలిసి ఎన్నో రకాల వీడియోలను ఈమె అభిమానులతో పంచుకుంటున్నారు.ఇటీవల కాలంలో ఫేమస్ కావడానికి సోషల్ మీడియాను ఒక సాధనంగా వినియోగించుకున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు తమ పాపులారిటీని మరింత పెంచుకోవడానికి సోషల్ మీడియా ఒక ఆయుధంలా మారిందనే చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకున్న వారు చాలామందే ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ నటి శివ జ్యోతి తన పాపులారిటీని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. శివ జ్యోతి న్యూస్ యాంకర్‌గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి.. ఆ తర్వాత బిగ్‌బాస్‌లోకి వెళ్లింది. ఇక సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఆమెకు యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది. వీడియోలు చేస్తూ.. ఇన్‌స్టాలో రీల్స్‌, ఫొటోషూట్‌లు చేస్తూ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా శివజ్యోతి హైదరాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌పై రీల్స్‌ చేస్తూ.. సందడి చేసింది.దీనికి సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అయితే దీన్ని చూసిన వారు శివజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుద్ధుందా మీరు ఫేమస్ అవడం కోసం ఇలా ఔటర్ రింగ్ రోడ్డుపై రీల్స్ చేస్తారా మిమ్మల్ని చూసి ఎంతోమంది కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు.ఎంతోమందికి స్ఫూర్తిగా ఉండాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అంటూ మండిపడుతున్నారు.నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: