సాధారణంగా సినిమా అనే రంగుల ప్రపంచంలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి గుర్తింపును సంపాదించుకోవడం అంత సులభమైన విషయం కాదు. చాలామంది హీరోయిన్లు ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాక చివరికి కనుమరుగవుతూ ఉంటారు  కొంతమంది మాత్రం అతి తక్కువ సమయంలోనే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఏకంగా నక్క తోక తొక్కి వచ్చినట్లుగానే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోతూ ఉంటారు. అలాంటి హీరోయినే శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందడి అనే మూవీతో హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ చిన్నది. అంతకుముందు కన్నడ భాషలో ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అయితే పెళ్లి సందడిలో తన క్యూట్ లుక్స్ తో పాటు నటనతో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకాలో నటించి బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. మూవీ తో శ్రీ లీల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు కూడా తలుపు తట్టాయ్.


 ఇక శ్రీలీల పట్టిందల్లా బంగారమే అయినట్లు.. ఈ అమ్మడు చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయం సాధిస్తూ వచ్చాయి. గత కొన్ని కొంతకాలం నుంచి మాత్రం బాక్సాఫీస్ వద్ద ఈమె నటించిన సినిమాలు పెద్దగా సత్తా చాటలేకపోతున్నాయి. ఇటీవల శ్రీ లీలా కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. మాస్ మహారాజుతో కలిసి మరోసారి జోడి కట్ట పోతుంది. ఇక ఈ పూజ కార్యక్రమాలు ఇటీవల జరిగగా.. ఇక అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి  ఇక ఈ ఫోటోలు చూస్తుంటే టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గుర్తుకువస్తుంది అని చెప్పాలి. అప్పట్లో ఆర్తి అగర్వాల్ స్టార్ హీరోయిన్గా ఎంతల హవా నడిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఇప్పుడు ఫోటోలు అచ్చం ఆర్తి అగర్వాల్ ను తలపించేలా ఉన్నాయి. ఇక ఈ ఫోటోలు చూసి ఫాన్స్ సైతం షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: