టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరోలు కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు. ఈ కొంతమందిలో సొంత టాలెంట్ తో ఎదిగిన వారే ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పాలి. అలాంటి వారిలో అడవి శేషు కూడా ఒకరు. ఏకంగా రైటర్ గా తన కెరీర్ ప్రారంభించి డైరెక్టర్గా హీరోగా కూడా సత్తా చాటుతున్నారు. కెరియర్ ప్రారంభంలో సొంతం, కర్మ, పంజా, బలుపు, కిస్, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాహుబలి, దొంగాట, సైజ్ జీరో లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రూల్స్ లో చేసి ఆకట్టుకున్నాడు అడవి శేషు. క్షణం అనే మూవీతో హీరోగా అవతారం ఎత్తడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు.


 ఆ తర్వాత గూడచారి మూవీ తో బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని అతనిలోని టాలెంట్ ని అందరికీ అర్థం అయ్యేలా చేశాడు. ఇక హిట్ 2 మూవీ తో మరో సక్సెస్ ని అందుకున్నాడు. మేజర్ అనే మూవీ తో హ్యాట్రిక్ కొట్టడంతో ఇండస్ట్రీలో అతని పేరు మారుమోగిపోయింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో గూడాచారి 2, డెకయిట్ లాంటి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలలో హీరో గానే కాదు స్క్రీన్ రైటర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు అడవి శేషు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న అడవి శేషు ఇటీవల తన పేరు వెనుక ఉన్న ఒక రహస్యం గురించి షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు.


 ప్రస్తుతం అందరూ అతన్ని అడవి శేషు అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే తన ఒరిజినల్ నేమ్ సన్నీ చంద్ర అంటూ చెప్పుకొచ్చాడు. అమెరికాలో ఉన్నప్పుడు నా పేరు చూసి అందరూ ఏడిపించేవారూ. అక్కడ ఆరేంజ్ ఫ్లేవర్ లో సన్నీ డిలైట్ అనే ఒక జ్యూస్ ఉండేది. అలాగే అప్పట్లో నటి సన్నీలియోన్ చాలా ఫేమస్. అయితే నాకు పేరులో సన్నీ ఉండడంతో అందరూ ఇక ఏడిపిస్తూ ఉండేవారు  ఇక ఇదే విషయం నాన్నకు చెబితే నా పేరును శేష్ అని మార్చుకో అని సూచించారు  అప్పటినుంచి నా పేరును శేషు గా మార్చుకున్నా. ఇక అడవి  సినిమాలో నటించడంతో ముందు అడవి శేషు అనే వచ్చి చేరింది అంటూ చెప్పుకొచ్చాడు ఈ యంగ్ హీరో.

మరింత సమాచారం తెలుసుకోండి: