కలెక్షన్ కింగ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోగా హవా నడిపించిన మంచు మోహన్ బాబు.. ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇక మంచు మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీకి ఇద్దరు కొడుకులతో పాటు ఒక కూతురు కూడా పరిచయమైంది. ఇక ఇద్దరు కొడుకులు కూడా తమదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


  మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు లక్ష్మి కాస్త లేటు గాని సినీ ప్రేక్షకులను పలకరించింది. ఇక ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాగా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు బిజీగా ఉంటుంది. అయితే ఇటీవలే మంచు లక్ష్మీ తన తండ్రే తనకు శత్రువుగా మారాడు అంటూ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్. మంచు లక్ష్మి హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలు కన్నదట. కానీ ఇక అన్ని కలలు కూడా కలలుగానే మిగిలిపోయాయట. ఎందుకు కారణం తన తండ్రి అంటూ మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేసింది.


 బిజినెస్ మాన్ సినిమాలో మహేష్ బాబు ముంబైని ఉచ్చ పోయించడానికి వచ్చినట్టు చెప్పే డైలాగ్ ప్రకారమే నేను కూడా బాలీవుడ్ కి వెళ్ళాలి అనుకున్నాను  కానీ ఆ సమయంలో ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. నా తండ్రి బాలీవుడ్ వెళ్లడానికి నిరాకరించారు. ఆ టైంలో నా ఫ్రెండ్స్ దగ్గుబాటి రానా లాంటివాళ్ళు.. నువ్వు బాలీవుడ్ వెళ్ళిపో అని సలహా ఇచ్చినప్పటికీ.. నా తండ్రి మాత్రం నేను వెళ్లడానికి ఒప్పుకోలేదు. ఒకరకంగా నేను పితృ సౌమ్య బాధితురాలిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది  ఇక తన సినీ కెరియర్లో తన తండ్రి తనకు పెద్ద శత్రువు అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు నా తండ్రి తో పాటు తన భర్త ప్రకాష్ తండ్రి కూడా ఒప్పుకోలేదు అంటూ మంచు లక్ష్మి తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: