సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలకు సంబంధించిన ఫోటోలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంటాయి.  హీరోలు సినిమా కోసం కొత్త లుక్ లో కనిపించడం లాంటి ఫోటోలు అభిమానులను దృష్టిని ఆకర్షిస్తుంటే.. కొన్ని కొన్ని సార్లు ఇలాగే స్టార్ హీరోలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు కూడా ఇంటర్నెట్లోకి వచ్చి తెగచక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే ఆ ఫోటోలలో ఉన్న హీరో ఎవరు అన్న విషయాన్ని కొన్ని కొన్ని సార్లు అభిమానులే గుర్తుపట్టలేకపోతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఒక హీరో చైల్డ్ హుడ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఏకంగా నాన్న చంకన ఎక్కి ఎంతో క్యూట్ గా అమాయకంగా చూస్తున్న బుడ్డోడిని చూసి వావ్ అనుకుంటున్నారు నెటిజన్స్. అయితే ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు ఏకంగా టాలీవుడ్ లో ఒక క్రేజీ హీరో అని తెలిసి షాక్ అవుతున్నారు. అయితే ఈ ఫోటో చూసి అభిమానుల సైతం ఆ హీరోని గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంతకీ మీరు గుర్తుపట్టారా.. ఇంకా గుర్తుపట్టలేదా సరే మేమే చెప్పేస్తాం లెండి. ఆ అబ్బాయి ఎవరో కాదు సుశాంత్ అనుములు. ఆయనని అక్కినేని హీరో అని పిలుచుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు మనవడు  ప్రొడ్యూసర్ నాగ సుశీల తనయుడు. అంటే కింగ్ నాగార్జున మేనల్లుడు అన్నమాట.


 ఇప్పుడు మీకు గుర్తొచ్చే ఉంటుంది. 2008లో కాళిదాసు అనే మూవీతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2009లో కరెంట్ మూవీతో ఆడియన్స్ కి దగ్గరయ్యాడు  కానీ ఆ తర్వాత సుశాంత్ కెరీర్ మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ విధంగా  సాగలేదు. వరుస ప్లాపులతో సతమతమయ్యాడు. ఇక చాన్నాళ్ళకి రాహుల్ రవీంద్ర డైరెక్ట్ చేసిన ఛిలాసౌ అనే సినిమాతో ఒక హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సహాయ నటుడుగా టర్న్ తీసుకొని ఇతర హీరోల సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఇటీవల తన తండ్రితో దిగిన చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: