తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా భారీ బడ్జెట్ తో 'ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం' GOAT పేరుతో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లియో సినిమాతో జస్ట్ యావరేజ్ కొట్టిన  విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందువల్ల ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.పైగా ఇది విజయ్ చివరి సినిమా అని ఈ సినిమా తర్వాత విజయ్ రాజకీయాల్లో బాగా బిజీ అవుతాడని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ మూవీ కోసం విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదీ గాక ప్రస్తుతం విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమాలో తప్ప వేరే ఏ చిత్రంలో కూడా నటించట్లేదనే విషయం తెల్సిందే. ఇక తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో మంచి క్రేజ్ రాగా, ఈ సినిమా నుండి తర్వాత వచ్చే అప్డేట్స్ పై కూడా అభిమానుల్లో ఆత్రుత మరింత పెరిగింది. అయితే  తాజాగా GOAT సినిమా నుండి దళపతి విజయ్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తూ, విజయ్ బర్త్ డే (జూన్ 22) స్పెషల్ గా “ది గోట్ బర్త్ డే షాట్స్” పేరుతో సూపర్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసారు మూవీ యూనిట్.


విజయ్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ అయిన “ది గోట్ బర్త్ డే షాట్స్” గ్లిమ్ప్స్ వీడియో మాత్రం విజయ్ ఫాన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పాలి. మామూలుగా బర్త్ డే ట్రీట్ కి ఒక కొత్త లుక్ ని లేదా, మేకింగ్ వీడియో ని మేకర్స్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ అంతా కూడా అనుకున్నారు, కానీ అర్ధరాత్రి టైం లో ఇలా మంచి థ్రిల్లింగ్ వీడియో ని రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ అస్సలు అనుకోలేదు. ఇక గ్లిమ్ప్స్ వీడియోలో ఎక్కడా కూడా ఎలాంటి డైలాగ్స్ పెద్దగా లేకపోగా, టీజర్ ని థ్రిల్లింగ్ షాట్స్ తో అర సెకన్ల గ్యాప్ తో సూపర్ షాట్స్ తో వీడియోని డిజైన్ చేసారు. ఇక ఈ వీడియో లో హీరో విజయ్ ద్విపాత్రాభినయంతో కనిపిస్తుండగా, వీడియోలో రెండు పాత్రలూ బైక్ పై ఉన్న వీడియో తో దర్శకుడు వెంకట్ ప్రభు మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ ని ఇచ్చాడు. అయితే ఈ మూవీ స్టోరీ లైన్ గురించి మాత్రం ఎలాంటి హింట్ ఇవ్వలేదు. ఇక ఈ వీడియోలో థ్రిల్లింగ్ షాట్స్ బాగానే ఉండగా, దానికి తగ్గట్టు మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఇచ్చిన బీజీఎమ్ కూడా బాగుంది. ఈ మూవీ పై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా తెలుగు హక్కులని మైత్రి వారు దక్కించుకున్నారు. కాబట్టి తెలుగులో ఖచ్చితంగా భారీగా రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు వసూళ్లు రాబడుతుందని విజయ్ ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని కోట్ల వసూళ్లు రాబడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: