తెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె సుశాంత్ హీరోగా రూపొందిన ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ యావరేజ్ విజయం అందుకున్న ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ రవితేజ హీరోగా రూపొందిన కిలాడి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఇందులో ఈమె తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోయడంతో ఈ సినిమా తర్వాత కూడా ఈమెకు అవకాశాలు దక్కడం మొదలు అయింది.

బ్యూటీ హిట్ ది సెకండ్ కేస్ మూవీతో మొదటి విజయాన్ని తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈమె కొన్ని రోజుల క్రితమే మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ నటి వరస తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తుంది ఈమె ప్రస్తుతం తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
]
తమిళ్ లో గోట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ కి మరో తమిళ సినిమాలో అవకాశం దక్కినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడుగా గుర్తింపును సంపాదించుకున్న నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటిస్తున్న దిల్లుకు దుడ్డు 4 లో ఫీమేల్ లీడ్ రోల్ కి మీనాక్షి ఎంపిక అయినట్లు సమాచారం. ప్రేమానంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని టాలెంటెడ్ యాక్టర్ ఆర్య నిర్మిస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ను కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

mc