శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు మనమే అనే సినిమాను నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ జూన్ 7 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మిక్స్ డ్ టాక్ లభించింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడం కష్టమే అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా మెల్లిమెల్లిగా రాబడుతూ రెండవ వారం ఇతర సినిమాల నుండి పోటీని ఎదుర్కొని కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ సినిమా 15 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. మరి ఈ సినిమా 15 రోజుల్లో ఏ ఏరియాలో ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఎన్ని లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

15 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.62 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 88 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 3.81 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 15 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.31 కోట్ల షేర్ ... 16 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 15 రోజుల్లో 60 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1.12 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 15 రోజుల్లో 10.03 కోట్ల షేర్ ... 19.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా 15 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని మూడు లక్షల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: