ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన కూడా ఒకే సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోయే కల్కి 2898 గురించి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. తన కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. ఇక భారీ బడ్జెట్ తో తెరకేకిస్తున్న ఈ మూవీ పై మొదటి నుండి అంచనాలు భారీగానే ఉన్నాయి.


 కానీ ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో చూసిన తర్వాత ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. కల్కి మూవీ ఏకంగా ప్రేక్షకుల ఊహకంగా రీతిలో ఉండబోతుంది అన్న విషయం ట్రైలర్ ద్వారానే ప్రేక్షకులందరికీ కూడా అర్థమైంది.  దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందో ఎప్పుడు చూద్దామా అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆతృతక ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయో బుక్ చేసుకుందామా అని 1000 కళ్ళతో పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇలా ఇటీవల రిలీజ్ ట్రైలర్ కూడా అభిమానులలో అంచనాలను పెంచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కల్కి మూవీకి సంబంధించిన టికెట్లు బుకింగ్ కోసం అటు పేటీఎంలో వెయిట్ చేసే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. కేవలం ఒక్క పేటీఎంలోనే 10 లక్షల మంది కలిసి సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇలా కల్కి మూవీకి ఏర్పడిన బజ్  చూసి అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇండియన్ సినిమా హిస్టరీలో కేవలం కల్కి మూవీకి మాత్రమే ఈ ఘనత సాధ్యమైందని ఎంతోమంది సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. కల్కి మూవీతో హాలీవుడ్ హీరో రేంజ్ లో పాపులారిటీ దక్కించుకోవడం ఖాయమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: