ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు , వెబ్ సిరీస్ లు ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లోకి తెలుగు భాషలో అందుబాటు లోకి వచ్చాయి. అలా ఈ వారం తెలుగు భాషలో ఓ టీ టీ లోకి అందుబాటులోకి వచ్చిన సినిమాలు , వెబ్ సిరీస్ లు ఏవి అనే విషయాన్ని తెలుసుకుందాం.

గం గం గణేశా : ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తాజాగా తెలుగు భాషలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చింది.

రాధా మాధవం : ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చింది.

ఫ్రీ లాన్స్ : ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఇంగ్లీష్ , తెలుగు , తమిళ , హిందీ భాషలలో అందుబాటులోకి వచ్చింది.

అరన్మనై 4 : తమన్నా , రాశి కన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ తమిళ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యింది. ఈ మూవీ తెలుగు లో బాక్ అనే టైటిల్ తో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టీ టీ లోకి తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ భాషలలో అందుబాటులోకి వచ్చింది.

కోట ఫ్యాక్టరీ సీజన్ 3 : ఈ వెబ్ సిరీస్ తాజాగా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి హిందీ , తెలుగు , తమిళ , ఇంగ్లీష్ భాషలలో అందుబాటులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott