లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ఇండియాలోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం ఇండియన్ 2 అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. ఈ సినిమా ఇండియన్ అనే పేరుతో తమిళ్ లో విడుదల కాగా , భారతీయుడు అనే పేరుతో తెలుగు లో విడుదల అయింది. దానితో ఇండియన్ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ ని తమిళ్ లో ఇండియన్ 2 అనే పేరుతో విడుదల చేయనుండగా , తెలుగు లో భారతీయుడు 2 అనే టైటిల్ తో విడుదల చేయబోతున్నారు.

ఇకపోతే భారతీయుడు 2 సినిమాలో సిద్ధార్థ్ , కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో కనిపించనుండగా , లైకా ప్రొడక్షన్ సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని జూలై 12 వ తేదీన తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది.

మూవీ యొక్క ట్రైలర్ ను జూన్ 25 వ తేదీన ముంబైలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన రన్ టైమ్ ను కూడా మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను 2 నిమిషాల 36 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: