తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో వంశీ పైడిపల్లి ఒకరు. ఈయన ఇప్పటివరకు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీలలో మంచి విజయాలు అందుకున్నాడు. కానీ ఈయన కెరియర్ తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది దర్శకులతో పోలిస్తే సూపర్ స్లో గా కొనసాగుతుంది. స్టార్ హీరోలతో సినిమాలు తీయడంలోనూ , వాటితో హిట్లు కొట్టడంలోనూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన స్పీడుగా సినిమాలు తీయడంలో మాత్రం చాలా వెనకబడిపోయాడు. వంశీ పైడిపల్లి 2007 వ సంవత్సరం విడుదల అయిన మున్నా మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టాడు.

మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో చాలా గ్యాప్ తీసుకున్న ఈయన ఆ తర్వాత బృందావనం మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ చాలా గ్యాప్ తీసుకొని ఎవడు, ఊపిరి, మహర్షి, వారసుడు సినిమాలకు దర్శకత్వం వహించాడు. దీనితో ఈయన కెరీర్ మొదలు పెట్టి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతున్న చాలా తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించాడు. మరి ఈయన ఎందుకు ఇంత స్లో గా సినిమాలు చేస్తాడు అనే విషయానికి వస్తే ... ఈయన తన సినిమాలకు కథ రాసుకోడు. కథ రచయిత ద్వారా కథ తీసుకొని దానితో సినిమా చేస్తాడు.

దాని ద్వారా మంచి కథ వెతకడానికి ఎక్కువ సమయం పట్టడం , అలాగే ఒక హీరోతో అనుకుంటే ఆ హీరోతోనే సినిమా చేయాలి అని పిక్స్ అయ్యి అతని కోసం వెయిట్ చేస్తూ ఉండడం , అలాగే స్టార్ హీరోలతో మాత్రమే సినిమా చేయాలి అనే ఉద్దేశంలో ఉండడం. ఇలా అనేక కారణాల వల్ల ఈయన ఒక్కో సినిమాకు పెద్ద మొత్తంలో గ్యాప్ వస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఈయన తాను దర్శకత్వం వహించిన సినిమాలలో ఎక్కువ శాతం మూవీలతో మంచి విజయాలను అందుకొని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: