తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న తండ్రి, కొడుకులు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందు వరసలో ఉంటారు. వీరిద్దరూ కూడా ప్రస్తుతం స్టార్ హీరోలుగా తెలుగు సినీ పరిశ్రమలో కెరీర్ను కొనసాగిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పోలిస్తే కొన్ని విషయాలలో ఇప్పటికీ కూడా రామ్ చరణ్ వెనకబడిపోయి ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా కెరియర్ లో కొనసాగిస్తున్న సమయంలోనే రాజకీయాల వైపు దృష్టిని మళ్లించి కొంత కాలం రాజకీయాలతో బిజీగా ఉండి సినిమాలలో నటించలేదు.

మళ్లీ ఖైదీ నెంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. పోయిన సంవత్సరం ఏకంగా చిరంజీవి నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. దానితో చిరంజీవిసినిమా షూటింగ్ ను ఫుల్ జోష్ లో పూర్తి చేస్తున్నాడు.

మేకర్స్ అనౌన్స్ చేసినట్లుగానే ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్ మాత్రం చాలా స్లో గా సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఈయన గేమ్ చేంజర్ సినిమాలు ఎప్పుడో మొదలు పెట్టాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఆ మూవీ విడుదల తేదీని కూడా ఇప్పటికి మేకర్స్ అనౌన్స్ చేయలేదు. ఈ మూవీ ని ఎప్పుడు విడుదల చేస్తారో అనే క్లారిటీ ఈ మూవీ యూనిటీ కూడా పెద్దగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇలా వరుస సినిమాలతో చిరు జడ్ స్పీడ్ లో దూసుకుపోతూ ఉంటే చరణ్ మాత్రం సూపర్ స్లో గా సినిమాలు చేస్తూ చిరంజీవితో పోలిస్తే వెనుకబడి పోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: