కల్కి.. కల్కి.. కల్కి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు మారు మోగుతుంది. జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ చిత్రం రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ వద్ద ఊచ కోత కోసింది. కల్కి ఇప్పుడు రిలీజ్ కు ముందే భారీ బిజినెస్ చేస్తూ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో కల్కి ఊపు చూస్తుంటే ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ కు మించి కలెక్షన్స్ వచ్చే విధంగా ఉంది అంటున్నారు జనాలు.

ఇంకా రిలీజ్ కు ఐదు రోజులు గడువు ఉంది. అప్పుడే ప్రీ బుకింగ్స్ లో కల్కికి రికార్డు క్రియేట్ చేసింది. నార్త్ అమెరికాలో అప్పుడే ప్రీ బుకింగ్ ఓపెన్ చేశారు. రెండు మిలియన్ల డాలర్లు రాబట్టింది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. రెండు రాష్ట్రాలలో కలిపి 150 కోట్లు దాకా బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తుంది. పలు అగ్రిమెంట్లు డీల్స్ కూడా క్లోజ్ చేశారు కల్కి మూవీ మేకర్స్. డిస్ట్రిబ్యూటర్స్ కూడా పెట్టిన డబ్బుకి నాలుగైదు రెట్లు వెనక్కి తెచ్చుకుంటాం అనే ధీమాతో ఉన్నారు. తెలంగాణ రైట్స్‌ ఏకంగా 70 కోట్లకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది.

అంతేకాకుండా అశ్విని దత్ ఈ సినిమా కోసం 6 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే సినీ ఎక్స్పెక్ట్స్ ఈ సినిమా 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ చేస్తుంది అంటూ అంచనా వేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ సినిమా పై మరింత హైప్స్ ఏర్పరిచింది. ఒక్కొక్క సీన్ గూస్ బమ్స్ పుట్టించింది. ప్రభాస్ ఖాతాలో బాహుబలికి మించిన హిట్ పడేలాగానే కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఏదేమైనాప్పటికీ ప్రజెంట్ కల్కిపై భారీ రేంజ్ లో హైప్స్ ఏర్పడ్డాయి. మరి వీటిని ప్రభాస్ ఎంతవరకు అందుకోగలడో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: