ఈ మధ్యకాలంలో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్న నిర్మాతలలో నాగ వంశీ ఒకరు. ఈయన ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నాడు. ఈయన నిర్మించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు, ఈయన నిర్మాణ సంస్థకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నిర్మాత సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

సినిమా చిత్రీకరణ చాలా భాగం పూర్తి అయ్యే వరకు ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించలేదు. ఇక సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానున్న ఓజి సినిమా పోస్ట్ పోన్ అయ్యింది అనే వార్తలు బలంగా వినిపిస్తున్న సమయంలో ఈ నిర్మాత లక్కీ భాస్కర్ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. ఇక దాని తర్వాత అక్టోబర్ 10 వ తేదీన విడుదల అని ప్రకటించిన దేవర మూవీ ని ఫ్రీ ఫోన్ చేస్తూ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో ఎన్టీఆర్ సినిమాతో పోటీ అంటే కష్టం అనుకున్న నాగ వంశీ ఈ సినిమాను వేరే తేదీన విడుదల చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరి దానితో ఏ తేదీన విడుదల చేస్తే కరెక్ట్ అనే విషయంపై ఈయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తొందరపడి ఓ విడుదల తేదీని అనౌన్స్ చేస్తే ఒక వేళ ఆ తేదీన మరో పెద్ద సినిమా విడుదల తేదీ అనౌన్స్ అయినట్లయితే మరోసారి సినిమాలు ఫోన్ చేయకూడదు అనే ఉద్దేశంలో ఒక మంచి తేదీ కోసం ఈ నిర్మాత చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈయన తొందరపడి సెప్టెంబర్ 27 వ తేదీన లక్కీ భాస్కర్ మూవీ ని అనౌన్స్ చేసి అయోమయంలో పడిపోయినట్లు మరోసారి జరగకూడదు అని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: