పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా కల్కి. పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపిక పదుకొనే  హీరోయిన్స్ గా నటిస్తున్న కల్కి చిత్రంపై ప్రెసెంట్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రజెంట్ కల్కి ఫీవర్ ఏ రేంజ్ లో నడుస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ కూడా ప్రభాస్ అభిమానులతో పాటు ఇండియా మూవీ లవర్స్ లో మరింత హైప్స్ ని క్రియేట్ చేస్తున్నాయి.

ఇక తాజాగా ఈ మూవీ నుంచి రెండవ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ చూశాక టోటల్ పాన్ ఇండియా ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి క్రేజీ బజ్ క్రియేట్ అయింది. ఈ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ కూడా నమోదయింది. మొత్తం అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్ కి ఇప్పుడు ఏకంగా 20 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.  ఇదంతా ఇంకా 24 గంటలు పూర్తి కాకముందే జరిగింది. మొత్తానికి అయితే ఈ భారీ సినిమాపై అంచనాలు ఈ కొత్త ట్రైలర్ మరింత పెంచిందని చెప్పుకోవచ్చు.

ఇక మొత్తం సినిమాలో ఎలాంటి సర్ప్రైజ్లు ఉంటాయో చూడాల్సిందే. ఈ సినిమాలో దీపికా పదుకొనే అండ్ దిశా పటాని తో పాటు క‌మల్ హాసన్ అండ్ అమితాబచ్చన్ వంటి స్టార్స్ కూడా ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం ఈనెల అనగా జూన్ 27వ తారీకున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరి రిలీజ్ అనంతరం కల్కి ఫీవర్ ఏమాత్రం వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే కల్కి పై భారీ హైప్స్ నమోదు అయ్యాయి. ఈ హైబ్స్ని కనుక కల్కి అందుకోగలిగితే దీనికి సీక్వెల్ కూడా వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: